బ్లాక్ బస్టర్ సినిమాలో నటించే ఛాన్స్ వదులకున్న మాస్ మహరాజ్..!

తమిళ హీరో ధనుష్ నటించిన వడ చెన్నైసినిమా రికార్డులు బద్దలు కొట్టింది. 2018లో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది. వైవిధ్యభరితమైన కథాచిత్రాల దర్శకుడిగా వెట్రి మారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం వెట్రిమారన్ మొదట విజయ్ సేతుపతిని సంప్రదించారట. కానీ బిజీ షెడ్యూల్ వల్ల సేతుపతి నో చెప్పారట. ఆ తరవాత ఈ పాత్రకోసం మాస్ మహరాజ్ ను సంప్రదించారట. ఈ చిత్రంలో నార్త్ మద్రాస్ స్మగ్లర్ రాజన్ పాత్రను పోషించమని రవితేజ ను కోరినట్లు వెట్రిమారన్ వెల్లడించారు. అంతే కాకుండా పాండిచేరిలో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో రవితేజకు వెట్రిమారన్ కథను కూడా వినిపించారట.
సినిమా కథ…తన పాత్ర రవితేజకు చాలా భాగా నచ్చినప్పటికీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో రవితేజ కూడా నో చెప్పారట. దాంతో వెట్రిమారన్ ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అమీర్ సుల్తాన్ ను సంప్రదించగా ఆయన కథ వినకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ విషయాన్ని వెట్రిమారన్ తాజాగా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తో జరిగిన తాజా సోషల్ మీడియా చర్చలో వెల్లడించారు.