వాయిదా ప‌డిన ర‌వితేజ మూవీ…తిరిగి మొద‌ల‌య్యేది అప్పుడే..!

raviteja movie shooting postponed due to coronavirus
raviteja movie shooting postponed due to coronavirus

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లోనే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంతే కాకుండా వైర‌స్ వ్యాప్తి కూడా ఎక్కువ‌గానే క‌నిపిస్తుంది. లాక్ డౌన్ విధిస్తే ఆర్థికంగా ఎదురయ్యే ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌భుత్వాలు ఆదిశ‌గా అడుగులు వేయ‌డంలేదు. అయితే నైట్ కర్ఫ్యూ అమ‌లు చేయ‌డం సామాజిక దూరాన్ని పాటించ‌డం..మాస్కులు ధ‌రించ‌డం లాంటి నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తుంది. ఇక క‌రోనా ప్ర‌భావం మ‌రోసారి సినిమా ప‌రిశ్ర‌మ మీద స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో షూటింగ్ ల‌కు బ్రేక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దాంతో సినిమాల‌న్నీ ఆగిపోయాయి.

ఇక ఇప్పుడిప్పుడే షూటింగ్ ల‌ను పూర్తి చేసుకుటున్న సంద‌ర్భంలో క‌రోనా సెకండ్ వేవ్ రూపంలో మ‌హ‌మ్మారి రీఎంట్రీ ఇచ్చింది. దాంతో ఇప్ప‌టికే ప‌లు స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక ఆ లిస్ట్ లో మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కూడా ఉన్నారు. ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా ఖిలాడి సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా త‌ర‌వాత శ‌ర‌త్ మండ‌వ అనే కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు ర‌వితేజ‌. అయితే ఈ సినిమా షూటింగ్ ను క‌రోనా ప‌రిస్థితులు మెరుగుప‌డ్డాకే మొద‌లు పెడ‌తామ‌ని చిత్ర నిర్మాత చెరుకూరి సుధాక‌ర్ వెల్ల‌డించారు.