రాజా ది గ్రేట్ కు సీక్వెల్ ఉండబోతుందా.?

  • Written By: Last Updated:
రాజా ది గ్రేట్ కు సీక్వెల్ ఉండబోతుందా.?

మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం “ఖిలాడి” సినిమాలో నటిస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ కూడా చివర దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ఈ సినిమా తరవాత నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమా కూడా పూర్తయ్యాక రవితేజ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని టాక్ వినిపిస్తోంది. రవితేజ కెరీర్ బ్యాడ్ గా ఉన్నప్పుడు “రాజా ది గ్రేట్” లాంటి సినిమాతో అనిల్ రావిపూడి హిట్ అందించాడు.

ఇక ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు సినిమా రాలేదు. అయితే ఇప్పుడు వీరి కాంబోలో సినిమా ప్లాన్ చేస్తున్నారట. అది కూడా రాజా ది గ్రేట్ కు సీక్వెల్ ఉండబోతుందని టాక్. అనిల్ ఇప్పటికే రవితేజ కు స్టోరీ లైన్ వినిపించగా మాస్ హీరోకు తెగ నచ్చేసిందట. దాంతో ప్రస్తుతం రావిపూడి పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నారట. ఇక ప్రస్తుతం లైన్ లో ఉన్న సినిమాలు ఫినిష్ అవ్వగానే అనిల్ రవితేజ సినిమాను మొదలు పెడతారని టాక్

follow us