అంత బాండ్ అయినా నాగబాబు వెంటనే ఇంకో షో ఎందుకు మొదలుపెట్టారు

నాగ బాబు జబర్దస్త్ నుంచి బయటకి వచ్చేసారు… ఆయన ఒక వీడియో విడుదల చేసారు .. ఆయనకి చాలానే బాండ్ ఉంది జబర్దస్త్ తో అని చాల బాధ వ్యక్తం చేసారు.. నేను అసలు బయటకి వస్తా అని అనుకోలేదు.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రత్యకమైన కృతజ్ఞతలు కూడా తెలిపారు.. ఇంత వరకు బాగానే ఉంది.. నాగ బాబు చేసింది .. ఆయన గురించి మాట్లాడానికి ఏమి లేదు..
కానీ ఇక్కడ వచ్చింది అసలు కథ.. ఆయన అంత బాండ్ అయినా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు.. వెళ్తూ వెళ్తూ చాల మందినే ఆయనతో పాటు తీసుకుపొయ్యారు.. వేరే ఛానల్ లో కుంపటి పెట్టారు.. షో కూడా వెంటనే స్టార్ట్ చేసారు.. ఆఖరికి అనసూయ ని కూడా తీసుకుపోయారు.. అది ఎంత వరకు మంచి పని కొంచెం నాగ బాబు గారు ఆలోచించారు.. కొంచెం కూడా సమయం తీసుకోకుండా వెంటనే చేయడం అంటే అర్ధం కావడం లేదు..
రెమ్యూనరేషన్ చాల తక్కువ ఇస్తున్నారు అని నాగ బాబు గారు ఇప్పుడు బయటకు వచ్చాక మాట్లాడడం ఎంత వరకు సమంజసం.. మళ్లీ దీనిని పార్ట్స్ పార్ట్స్ గా చెప్తా అంటూ ఆయన యూట్యూబ్ ఛానల్ గురించి తెలియని జనాలకి తెలిసేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఏమో..