పెద్ద పొరపాటు: ‘రెడ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ‘క్రాక్’ టికెట్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన తాజా చిత్రం రెడ్. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ ఈ సినిమాలో కథానాయికలు గా కనిపించనున్నారు. రామ్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం ఇది. ఇటీవల విడుదల చేసిన టీజర్, థియేట్రికల్ ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సినిమాను ఏకంగా ఏడూ బాషాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రామ్ లుక్ కు విశేషమైన స్పందన లాభించింది. రెడ్ కోసం మణిశర్మ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈ వెంట్‌కు అనేక మంది సినీ ప్రముఖులు కాగా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. అయితే రెడ్ మూవీ మొదటి టికెట్ ను త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అందచేశారు. కాగా, అది ‘రెడ్’ టికెట్ బదులు రవితేజ ‘క్రాక్’ సినిమా టికెట్ అందజేశారు. కాస్త ఆలస్యంగా గమనించిన.. అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలా జరిగిందో, లేదో అప్పుడో నెటిజన్లు ఈ పొరపాటును వైరల్ చేస్తున్నారు. ఓ సినిమా ఫంక్షన్ లో.. మరో సినిమా ప్రమోషన్స్ చేయడం మొదటిసారి చూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ లాంటి గెస్ట్ ముందు ఇలాంటివి ఏంటి అని ‘రెడ్’ ఈవెంట్ ను తిట్టిపోస్తున్నారు. కాగా ఇటీవలే ‘క్రాక్’ సినిమా ఈవెంట్ జరిగిన వేదికపైనే, ‘రెడ్’ ఈవెంట్ జరిగినట్లుగా అర్ధమవుతుంది. పైగా, ఆ టికెట్ పైన ‘రెడ్’ మూవీ విడుదల తేదీ 14-01-2021 బదులు.. ‘క్రాక్’ తేదీ 9-01-2021 తేదీ ఉండడం గమనించవచ్చు.