సముద్రపు ఒడ్డున ముద్దుగుమ్మ సాహసాలు

సముద్రపు ఒడ్డున ముద్దుగుమ్మ సాహసాలు

రెజీనా కాసాండ్రా మొదట శివ మనసులో శృతి అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకుంది లేదు కానీ ఆ తర్వాత సందీప్ కిషన్ తో రొటీన్ లవ్ స్టోరీ అనే చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు ఏవి అంతగా గుర్తింపు రాకపోవడంతో తెలుగు నుండి చెన్నై కు అక్కడ నుండి కన్నడ ఇండస్ట్రీ కి మకాం మార్చింది. ప్రస్తుతం అక్కడ సినిమాల్లో నటిస్తూ వస్తుంది.

ఈ రోజుల్లో హీరోయిన్స్ గా సినిమాల్లో రానివ్వాలంటే నటన ఒక్కటే ఉంటే సరిపోదు.. అందంతో పాటుగా ఫిట్ నేస్స్ ను మెయిన్ టైన్ చెయ్యాలి. ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ సమంత, రష్మిక, రాశిఖన్నా, రకుల్ లాంటి వారు జిమ్ లో ఎంతగానో శ్రమిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే డైట్ మెయిన్ టైన్ చేస్తూ జెరో సైజ్ తో సినిమాల్లో అవకాశాలు పడుతున్నారు. ఇప్పుడు అదే బాటలో రెజీనా కాసాండ్రా కూడా చేరింది. ఫిట్ నెస్ కోసం ఆమె బీచ్ లో బలమైన మొద్దును ఆమె భుజం పై ఎత్తుకుని సీట్ అప్స్ తీస్తూ ఓ పుల్లింగ్ త్రేడ్ ను షేక్ చేస్తూ, బీచ్ లో రన్నింగ్ చేస్తూ టైర్ ను రెండు చేతులతో పైకి ఎత్తి వాకింగ్ చేస్తూ. సముద్రం పక్కన బీచ్ లో ఫిట్నెస్ లు చేస్తుంది. ఇది మొత్తం కూడా ఆమె హిమాలయ అడ్వెంచర్ ఛాలెంజ్ కోసం ఆమె రెడీ అవ్వుతున్నట్లుగా తెలుస్తుంది. ఆమె ఫిట్ నెస్ ఫీట్స్ ను ఇంస్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

follow us