సమ్మర్ అంటే హాలిడేస్ : కానీ 2020 సమ్మర్ అంటే కరోనా హాలిడేస్

సమ్మర్ వస్తుంది అంటే పిల్లలకు సంబరం.. స్కూల్స్ ఉండవు.. ఇంట్లో ఆడుకోవచ్చు నిద్ర పోవచ్చు.. చదువుకునే అవసరంలేదు.. 

అలానే అమ్మమ్మ  , తాతమ్మల ఊరు వెళ్ళవచ్చు.. ఇంకా హాలిడే కు వెళ్ళవచ్చు.. అందరివి ఎన్నో ప్లాన్స్..

కానీ ఈ సారి సమ్మర్ మాత్రం కేవలం కరోనాకే అంకితం అయింది, మీకు చిన్నప్పటి నుంచి చెప్పుకోవడానికి కరోనా లాంటిది ఏమైనా గుర్తు ఉందా? లేదు కదా కానీ ఈ తరం పిల్లలకు లైఫ్ టైం మెమరీ ఈ కరోనా వైరస్ హాలిడేస్ అనే చెప్పాలి.. 

నాలుగు నెలల పాటు స్కూల్ లేక పోవడం మాటలు కాదు.. స్కూల్ వద్దు వద్దు అని ఎడ్చిన పిల్లలు కూడా ఇంట్లో ఉండే సరికి మాకు స్కూల్ లోనే బాగుంది.. స్కూల్ కి వెళ్లి పోతాం అనేలా చేస్తుంది ఈకరోనా..

అంతేనా.. ఎప్పుడు ఇంట్లోనే ఎందుకు కూర్చుంటావ్ బయటకి వెళ్లి తిరిగిరా మనుషులతో కలువు అనే వాళ్ళకి ఈ కరోనాతో హాలిడే దొరికినట్టే.. 

రవాణా ఆగిపోవడంతో ప్రకృతి లో ప్రశాంతత.. వన్య మృగాలు అన్ని రోడ్ల మీద సంచరిస్తున్నాయి.. ఈ సమ్మర్ లో జూ కి వెళ్లి మీరు జంతువులను చూడనవసరం లేదు ఇంట్లో నుంచి బాల్కనీ లోకి చూస్తూ ఉండండి ఏదో ఒక సమయం లో మీకు వన్య మృగం కనిపించక మానదు.. 

దేవుడికి రెస్ట్ దొరుకుంతుంధా అసలు అని అడిగే వాళ్ళకి ఇది ఒక సమాధానం.. దేవుడు 2020 లో సమ్మర్ వెకేషన్ తీసుకున్నాడు. 

రోజు ట్యూషన్.. మ్యూజిక్ క్లాస్.. లేక పోతే డాన్స్ క్లాస్ ఇలా రోజు బయటకి వెళ్లే పిల్లలకు 2020 సమ్మర్ స్పెషల్.. 

స్పోర్ట్స్ అంటే పిచ్చి.. టీవీ కి అత్తుకుపోతారు.. సీరియల్స్ చూస్తూనే కూర్చుంటారు.. … హాలిడేస్ వచ్చిన మాకు రిమోట్ ఇవ్వరు …. అబ్బా సమ్మర్ వెకేషన్ వస్తే టీవీ చూడలేము అనుకునే వాళ్ళకి 2020 సమ్మర్ స్పెషల్.. నో లైవ్ స్పోర్ట్స్.. నో రన్నింగ్ సీరియల్స్.. 

ఇంతే కాదు.. నో వెడ్డింగ్స్.. నో ఫంక్షన్స్, నో బర్త్డే పార్టీస్, నో కిట్టి పార్టీ.. అన్నిటికి హాలిడేస్.. 

2020 చాలా స్పెషల్.. ఈ ఇయర్ లో ఎప్పుడు హాలిడే దొరకని వాటి అన్నిటికి హాలిడే దొరికేసింది..