మహేష్ సినిమాలో రేణూ లేద‌ట‌!

మహేష్ సినిమాలో రేణూ లేద‌ట‌!

మ‌హేష్‌బాబు నిర్మాత‌గా ‘మేజ‌ర్‌’ అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అడ‌వి శేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రేణూ దేశాయ్ ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఈ సినిమాలో రేణూ లేద‌ని తేలింది. అస‌లు ఏ పాత్ర కోసం ఆమెను ఎవ‌రూ సంప్ర‌దించ‌లేద‌ని క్లారిటీ వ‌చ్చింది. రేణూ – అడ‌విశేష్ ఈమ‌ధ్య ఓ సంద‌ర్భంలో క‌లుసుకున్నారు. దాన్ని అదునుగా చేసుకుని అడ‌వి శేష్ సినిమాలో ఆమె న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు పుట్టించారు. లాక్ డౌన్ కార‌ణంలో అన్ని షూటింగుల‌తో పాటు `మేజ‌ర్‌` కూడా వాయిదా ప‌డింది. కొత్త షెడ్యూల్ ఎప్పుడు మొద‌లెడ‌తార‌న్న విష‌యంలో ఇంకా క్లారిటీ లేదు. ఇప్ప‌టికే ప్ర‌ధాన న‌ట‌నటుల ఎంపిక జ‌రిగిపోయింద‌ని, కొత్త‌గా `మేజ‌ర్‌` టీమ్ లోకి ఎవ‌రూ రాలేద‌ని, రేణూ పేరు కూడా అస‌లు ప‌రిగ‌ణ‌లోనికే తీసుకోలేద‌ని చిత్ర‌బృందంలో కీల‌క స‌భ్యుడొక‌రు చెప్పారు. అయితే బుల్లి తెర‌పై రేణూ బిజీగా మార‌బోతోంది. జీ తో రేణూకి కాంట్రాక్ట్ కుదిరింది. ఒక‌ట్రెండు సీరియ‌ల్స్, వెబ్ సిరీస్ చేయ‌డానికి రేణూ సిద్ధంగా ఉంద‌ని టాక్‌. 

follow us