ప్రేమ సందేశం ఇస్తున్న రేణు దేశాయ్ !

రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకుని తన పిల్లలతో ఓంటరిగా జీవిస్తుంది. ఫ్యామిలీ అండ్ పర్సనల్ విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, సినిమా, వెబ్ సిరీస్, బుల్లి తెర అంటూ సందడి చేస్తుంది. మొదట సినిమాకు “బద్రి” చిత్రంతో పరిచయం అయిన రేణు “జాని”తో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత పవన్ ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది. వీరిద్దరికి అధ్య, అకీర అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని కారణాలు మనస్పర్థలు రావడం వలన వాళ్ళు విడిపోయారు. కొంతకాలం వరకు కనిపించకుండా పోయిన రేణు సామాజిక కార్యక్రమాలపై చురుకుగా పాల్గొంటూ మరల ఆక్టివ్ అయ్యారు. తన ఇంస్టా గ్రామ్ ఖాతా ద్వారా లైవ్ లోకి వచ్చిన రేణు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తుంది.
ప్రేమ గురుంచి తనకు తెలిసిన విషయాలను షేర్ చేసుకుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఓ టైమ్ లో ప్రేమలో పడుతారు కొంతమంది సక్సెస్ చేసుకుంటే మరికొంత మంది అందులో ఫెయిల్ అవ్వుతారు. ఆ బాధను తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకుంటారు. జీవితం అనేది చాలా ముఖ్యం.. నీ జీవితం నీకు చాలా విలువైంది. ఆత్మహత్య అనేది సరైన నిర్ణయం కాదు. అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో టైమ్ స్పెండ్ చెయ్యాలి. మంచి డాక్టర్స్ వద్ద కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఓంటరిగా ఉండొదు ఒక్కరి వల్ల న్వువు చావకూడదు అంటూ నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చింది. ఇకా సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి రేణు దేశాయ్ “అధ్య” అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది.