రోజా కూతురు ‘హిడెన్ టాలెంట్’ చూసారా !

  • Written By: Last Updated:
రోజా కూతురు ‘హిడెన్ టాలెంట్’ చూసారా !

వెండితెరపై తన అందచందాలు, చలాకీతనంతో అప్పట్లో ఓ ఊపు ఊపేసిన రోజా.. ఇప్పుడు బుల్లితెరపై హవా కొనసాగిస్తోంది. అటు ఎమ్మెల్యేగా రాజకీయాల్లో చక్రం తిప్పుతూనే ఇటు కెమెరా ముందు జబర్దస్త్ నవ్వులతో అట్రాక్ట్ చేస్తోంది. కాగా రోజా, సెల్వమణి వారిద్దరి గారాలపట్టి అన్షుమల్లికలో ఓ గొప్ప టాలెంట్ దాగివుంది. ఆమె ఓ మంచి రచయిత్రి. నవలలు చదవడం అంటే ఆమెకు ఎంతో ఇష్టమట. ఆమె ‘షిఫ్టింగ్ పర్సిప్షన్స్’ అనే ఓ బుక్ కూడా రాసింది. ఈ పుస్తకం ఆమె ఎంతో అనుభవం ఉన్న రచయిత్రిలా రాసిందని పుస్తక ప్రచురణ కర్తలు వ్యాఖ్యానించారు. అన్షుమల్లిక తనలోని భావాలకు అక్షరరూపం ఇవ్వడం హ్యాబిట్ గా మార్చేసుకుందట. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఒమేగా ఇంటర్నేషనల్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుంది.

follow us

Related News