వణికిస్తున్న చలిలో పూర్తి చేసిన ఆర్ ఆర్ ఆర్ టీమ్

వణికిస్తున్న చలిలో పూర్తి చేసిన ఆర్ ఆర్ ఆర్ టీమ్

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్‌టి‌ఆర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్‌టి‌ఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్ర నుండి వాళ్ళు నటించిన పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తూ విడుదల చేసిన ప్రోమో కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో అలియా భట్, ఓలివియా మోరిస్, వారికి జతగా నటిస్తున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవ్వుతు వస్తుంది. కరోనా నిబందనలు పాటిస్తూ గత 50 రోజులుగా ఫుల్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే అందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చలికాలం లో షూటింగ్ అంటే ఎవరికైన వెన్ను లో వణుకు పుట్టాలిసిందే. అసలుకే కరోనా ఆపై చలి ఏమాత్రం ఆ జాగ్రత్తతో ఉన్నసీజనల్ వైరస్ ల భారీనా పడే అవకాశం లేకపోలేదు. జక్కన్న దర్శకత్వంలో షూటింగ్ అంటే మామూలుగా ఉండదు. ఒక్కో సన్నివేశాని ఎంతో ఫర్ఫెక్షన్ తో చెక్కుకుంటూ వస్తాడు. చలికి, వణుకుతూ, వేడి హిటర్స్ సహాయంతో చలి కాచుకుంటూ. వేడి వేడి పానీయాలు సేవిస్తూ గత యాబై రోజులనుండి ఆర్ఆర్ఆర్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరించారు, ఆ షెడ్యూల్ పూర్తి అవ్వడంతో మరో కీలకమైన షెడ్యూల్ కోసం పుణె కు ఆర్ఆర్ఆర్ టీమ్ రెడీ అవ్వుతుంది. వారం రోజులపాటు అక్కడే షూటింగ్ జరుపుకోబోతుంది. ఈ చిత్రం కోసం మెగా ఫ్యామిలి, నందమూరి ఫ్యామిలి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

follow us