కరోనా ను ఇలా తరిమేద్దాం :టీమ్ ఆర్ఆర్ఆర్

  • Written By: Last Updated:
కరోనా ను ఇలా తరిమేద్దాం :టీమ్ ఆర్ఆర్ఆర్

దేశంలో కరోనా విజృంభన కొనసాగుతుంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరగటంతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే పెరుగుతోంది. కరోనా విజృంభిస్తున్నా ప్రజలు మాత్రం అసలు వైరస్ లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు రోడ్లపైకి వస్తున్నారు. కాగా తాజాగా కరోనా నిబంధనలు పాటించాలని జాగ్రత్తగా ఉండాలని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ఓ వీడియోను రూపొందించింది.

వీడియోలో ఆర్ఆర్ఆర్ టీమ్ నుండి రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, దర్శకుడు రాజమౌళి, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ ఒక్కొక్కరు ఒక్కో భాషలో కరోనా జాగ్రత్తలు పాటించాలి చెబుతున్నారు. కాగా అలియా భట్ తెలుగు మాట్లాడుతూ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఆర్ఆర్ఆర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే కరోనా విజృంభనతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా..ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.

follow us