RRR : న్యూ ఇయర్ సర్ప్రైజ్

  • Written By: Last Updated:
RRR : న్యూ ఇయర్ సర్ప్రైజ్

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళినే అని చెప్పవచ్చు , ఆయన తీసిన 11 సినిమాలు ఒక్కొకటి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ సృష్టించినవే . బాహుబలి రెండు పార్ట్స్ తరవాత రాజమౌళి ఎవరితో సినిమా తెస్తాడా అని అందరూ ఆసక్తి తో చూస్తున్న తరుణంలో సంచలన ప్రకటనతో వచ్చాడు , తెలుగు లో టాప్ హీరోలుగా బాక్స్ ఆఫీస్ దగ్గర నువ్వా నేనా అని పోటీ పడుతూ ఉండే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ ప్లాన్ చేశాడు .

ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ఇప్పటికే 80% పూర్తి చేసుకుందని చిత్ర బృందం ప్రకటించింది , ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన అలియా భట్ నటిస్తుంది , అలాగే ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తుంది. రాజమౌళి ప్రేక్షకులకి న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ ఎన్టీఆర్ , రామ్ చరణ్ లుక్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట . దానితో పాటు సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాలలో వినికిడి . రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ డేట్ ముందే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే .

follow us