రూలర్ రివ్యూ : బాలయ్య బాబు మాస్

  • Written By: Last Updated:
రూలర్ రివ్యూ : బాలయ్య బాబు మాస్

రూలర్ , ఈ పేరు ఎందుకు పెట్టారు

ఈ సినిమా ఎందుకు తీశారు 

దర్శకుడు ఈ సినిమా కథ ని అసలు ఎలా చెప్పాడు 

సి కళ్యాణ్ కి కథ ఏం  అర్ధం అయ్యిందా ? 

బాలయ్య బాబు పిల్లలు ఆయన సినిమాలు చూడరా ?

బాలయ్య బాబు ఇంత  డాన్స్ చేస్తాడా ? 

అసలు ఇలాంటి సినిమా తియ్యాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది ? 

ఇలా అనుకుంటే పోతే ఒకటి కాదు.. అబ్బో సినిమా మొదటి కార్డు నుంచి చివరి  కార్డు వరకు అన్ని డౌట్స్.. ఒక బడా పారిశ్రామిక వేత్త ఉత్తర్ ప్రదేశ్ కి వెళ్తుంది… అక్కడ బాలయ్య బాబు కత్తి పోట్లతో ఆమెకి కనిపిస్తాడు.. హాస్పిటల్ లో చేర్చి చికిత్స చేయిస్తుంది.. అదే హాస్పటల్ లో ఒక వారానికి ఆ పారిశ్రామిక్ వేత్త బాలయ్య బెడ్ పక్కనే ఒకే రూమ్ లో గుండె పోటు తో చేరుతుంది.. ఆమె ని చంపడానికి చూస్తే బాలయ్య తన ఆక్సిజన్ మాస్క్ దానం చేసి కాపాడతాడు.. దీనికి ఆమె ఇంప్రెస్స్ అయ్యి పోయి తన చని పోయిన కొడుకు స్థానం లోకి అదే అర్జున్ ప్రసాద్ స్థానం లోకి మన బాలయ్య బాబు ని తీసుకు వస్తుంది.  ఇక అక్కడ నుంచి కథ మొదలు అవ్వుతుంది.. 

అసలు బాలయ్య బాబు పాత్ర ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఏకంగా ఒక 40 అంతస్థుల బిల్డింగ్ మీద నుంచి దూకేస్తున్న అమ్మాయి ని చొప్పర్ లో వచ్చి కాపాడతాడు బాలయ్య… 2000 కోట్ల ప్రాజెక్ట్ ఇంకో సరి 5000 కోట్ల ప్రాజెక్ట్ అలా ఎదో బఠాణి  ఇచ్చినట్టు ఇచ్చేస్తాడు బాలయ్య . అన్ని వేల కోట్ల బిజినెస్ చేసే ఆవిడా కొడుకు వచ్చాడు అంటే మీడియా ఎలా చెయ్యాలి.. కానీ బాలయ్య బాబు జయసుధ ( పారిశ్రామిక వేత్త ) తన కన్నా తల్లి అని నమ్ముతాడు.. ఎందుకు అంటే ఆ ఆక్సిజన్ పెట్టేప్పుడు బాలయ్య బాబు తల కి సెలైన్ స్టాండ్ తగిలి దెబ్బ మీద దెబ్బ ఇంకా కాస్త గట్టిగా  తగులుతుంది.. దానితో బాలయ్య బాబు గతం మర్చిపోతాడు.. 

అసలు బాలయ్య బాబు డాన్సులు.. ఆ స్టైలు బి సి సెంటర్స్ కాదు కదా అంత కన్నా తక్కువ సెంటర్స్ లో కూడా చూడలేరు ఏమో.. 

బాలయ్య బాబు హెయిర్ స్టైల్.. సన్ షేడ్స్ .. షూస్. విగ్గులు .. పోనీ ఏవి కూడా కాదు.. హీరోయిన్ తో బాలయ్య బాబు రొమాన్స్.. వేదిక అందాన్ని చూసి బాలయ్య పువ్వు ఇవ్వబోయి పులా కుండనే ఇస్తాడు.. 

2000 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చి  ఒక మినిస్టర్ ని పదివి తీసేసి.. పోలీసులు సపోర్ట్ లేకుండా చేసి ఆయనని చంపేస్తాడు.. ఈ సీన్ మొత్తం రెండు నిమిషాలలో.. అది బాలయ్య బాబు నిలబడి చేసేస్తాడు… ఒకటి కాదు కథలో అన్ని విడ్డురాలే.. బాలయ్య బాబు ఒక సీఈఓ , ఒక రైతు, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక అన్న, ఒక రైతు కొడుకు, ఒక గతం మర్చిపోయిన మనిషి, ఇలా సినిమా అత్యంతం వేరియేషన్స్ .. ఇది కాదు అసలు సినిమా మెయిన్ స్టోరీ స్లాట్ ఆలోచించగలరా ?

పరువు హత్యలు.. వాటిని రాజకీయాలతో కలపడం.. ఒక సీనియర్ మంత్రి.. 30 ఏళ్ల ముందే ఆయన మంత్రి.. ఆయన పేరు చెప్పుకునే ఆయన కుటుంబం అంత ఉంటుంది.. తన తమ్ముడు రెవిన్యూ మినిస్టర్.. పరువు హత్యలు కాస్త పొలిటికల్ హత్యలుగా మారిపోతాయి.. 

ఇంకా ఏమి చేయడం చేతకాని ఉత్తర్ ప్రదేశ్ వాళ్లకి ఆంధ్ర ప్రదేశ్ నుంచి రైతులని తీసుకు వెళ్లి యూ పి  ప్రభుత్వం అక్కడ వాళ్ళకి వ్యవసాయం నేర్పిస్తుంది.. అలా  ఒక రైతు కొడుకు మన బాలయ్య.. ఆ ఊరికే తిరిగి పోలీస్ గా వస్తాడు. ఆ నేలకి  విలువ పెరగడం వల్ల .. రాజకీయనాయకుడు వాటి మీద ఉన్న జి ఓ ని రద్దు చేస్తారు.. మళ్ళీ ఆ భూములు రైతులకి ఎలా చేరుతాయి. ఇది ఒక స్టోరీ.. 
ఒక పారిశ్రామిక వేత్త తనకి వారసులు ఉండరు.. బాలయ్య బాబు ని దత్తతు తీసుకొని తన సామ్రాజ్యానికి వారసుడిని చేస్తుంది.. తన తరువాత తన వాళ్లని చూసుకోడానికి.. 

ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా అంత కథే… అసలు దర్శకుడు ఎలా బాలయ్య బాబు ఇంకా కళ్యాణ్ ని ఒప్పించాడో ఈ కథ కి.. 

బాలయ్య బాబు మళ్ళీ మనం ఒక పలనాటి బ్రాహ్మ నాయుడు లేక పోతే ఒక విజయేంద్ర వర్మ నో చేస్తున్నామో అని ఆలోచన కూడా వస్తుంది.. ఏది ఏమైనా కానీ బాలయ్య బాబు మాస్ ఊర మాస్ అంతే.. 

CCC Rating : 1/5

follow us

Web Stories