గాన గంధర్వూడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం ప్రస్థానం:

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 1946 లో జూన్ 4 నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది.
బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే పాడేవారు ఆ తరువాత అన్ని భాషల్లో పాడారు. బాలసుబ్రహ్మణ్యం చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు. అత్యధిక పాటలు పాడి గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కారు, భారత అత్యున్నత పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి పలు ప్రభుత్వాల పురస్కారాలను , ఎన్నో నేషనల్ అవార్డులు, నంది అవార్డులు ఎస్. పి. బాలు అందుకున్నారు. అనేక సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.