రిప‌బ్లిక్ టీజ‌ర్…వ్య‌వ‌స్థ పునాదులే క‌రెప్ట్ అయిన‌ప్పుడు అంద‌రూ క‌ర‌క్టే..!

sai dharam tej republic movie teaser
sai dharam tej republic movie teaser

టాలీవుడ్ యంగ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ తాజాగా నటిస్తున్న సినిమా రిప‌బ్లిక్. ఈ సినిమాకు దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నారు. చిత్రంలో ర‌మ్య‌క్రిష్ణ మ‌రియు జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు హీరోయిన్ గా ఐశ్య‌ర్య రాజేశ్ న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడ‌ద‌ల చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్ మ‌రియు పోస్ట‌ర్ ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక తాజాగా ఈ సినిమా టీజ‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఇక ప్ర‌స్థానం లాంటి సూప‌ర్ డూప‌ర్ పొలిటిక‌ల్ డ్రామాను తెర‌కెక్కించిన దేవ క‌ట్టా మార్క్ ఈసినిమా టీజ‌ర్ లో క‌నిపించింది. టీజ‌ర్ లో డైలాగులు ఒక రేంజ్ లో పేలాయి. సాయి ధ‌ర‌మ్ తేజ్ వాయిస్ తో టీజ‌ర్ మొద‌లవ్వగానే ప్ర‌జాస్వామ్యం అంటే ఓటువేసే హ‌క్కో అరిచే హ‌క్కో అనే బ్ర‌మ‌లోనే ఇంకా మ‌నం బ్ర‌తుకుతున్నాం. అంటూ డైలాగులు ఆక‌ట్టుకున్నాయి. క‌ట్ట‌కుండా కూలిపోతున్న పునాదులే క‌రెప్ట్ అయిన‌ప్పుడు అంద‌రూ క‌రెక్టే అంటూ వ్య‌వ‌స్థ‌లో ని లోపాలను ఎత్తి చూపే విధంగా ఈ సినిమా టీజ‌ర్ ఉంది.