ఫ్యాన్స్ ను బాలయ్య ఎందుకు కొడతాడు.. ప్రతి బాలయ్య అభిమాని గర్వపడే సమాధానం

  • Written By: Last Updated:
ఫ్యాన్స్ ను బాలయ్య ఎందుకు కొడతాడు.. ప్రతి బాలయ్య అభిమాని గర్వపడే సమాధానం

నందమూరి బాలకృష్ణ.. ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఒక బ్రాండ్. కొట్టినా బాలయ్యే పెట్టినా బాలయ్యే ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా పట్టించుకోకుండా తనపని తాను చూసుకుంటాడు. కానీ, తన అభిమానుల జోలికి వస్తే మాత్రం అసలు సహించడు. బాలయ్యకు కోపం ఎక్కువ.. అభిమానులను దగ్గరకు రానివ్వడు.. ముట్టుకొనివ్వడు.. సెల్ఫీలు తీస్తే ఫోన్లు పగుల కొడతాడు.. ముక్కోపి అంటూ బయట బాలయ్య గురించి నానా రకాలుగా మాట్లాడతారు. అసలు బాలయ్య ఎలాంటి వాడు.. ఎందుకు అభిమానులను కొడతాడు అనేది మొట్ట మొదటిసారి రైటర్ సాయి మాధవ్ బుర్రా చెప్పారు. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన.. బాలయ్య గురించి చెప్పిన మాటలు బాలయ్య అభిమానులు వింటే.. కాలర్ ఎగరవేసి బాలయ్య అభిమాని అని గర్వంగా చెప్పుకుంటారు.

బాలకృష్ణ గారి గురించి బయట ఏవేవో అనుకుంటారు కానీ వాటిలో నిజం లేదు.. ఫోన్ లు పగులకొడతాడు.. అభిమానులను కొడతాడు అంటూ ఏవో వీడియోలు వస్తూ ఉంటాయి.. నేను చాలాసార్లు బాలయ్య బాబును ఆ విషయం గురించి అడుగుదామని దగ్గర వరకు వెళ్తాను.. మళ్లీ నన్నెక్కడ కొడతారో అని ఆగిపోయేవాడిని. ఒకసారి ఆయనే ఈ టాపిక్ తీసుకొచ్చారు. “నేను ఫ్యాన్స్ ను కొడతాను అంటారు.. అసలు హీరోలందరు బౌన్సర్లను ఎందుకు పెట్టుకుంటారు.. ఫ్యాన్స్ ను కొట్టడానికే కదా. వారి మీదకు వచ్చేవారిని తోసెయ్యడానికి.. ఇంకొంచెం మీదకు వస్టే ఓ దెబ్బ వేయడానికి.. అందుకేగా బౌన్సర్లను పెట్టుకొనేది. నిన్న కాక మొన్న వచ్చిన హీరోలు కూడా నలుగురైదుగురు బౌన్సర్లను పెట్టుకొని అభిమానులను కొట్టిస్తున్నాడు. నా ఫ్యాన్స్ ను కొట్టడానికి వాడెవడు బౌన్సర్ అని బాలయ్య బాబు అన్నాడు. నా ఫ్యాన్స్ ను కొట్టడానికి డబ్బులిచ్చి బౌన్సర్లను పెట్టాలా నేను.. వాళ్లు నా ఫ్యాన్స్.. నేను కొడితే పడతారు.. మహా అయితే నా మీదకొస్తారు.. వాళ్లు నా ఫ్యామిలీ మెంబెర్స్.. నా ఫ్యామిలీ ని కొట్టడానికి డబ్బులిచ్చి బౌన్సర్లను పెట్టుకుంటానా.. నేను ఆ పని చేయను.. కోపం వస్తే నేనే వాళ్ళ మీదకు వెళ్తా.. వాళ్లు ఏదైనా అనాల్సి వస్టే నన్ను అంటారు.. మధ్యలో వీడెవడు బౌన్సరు..ఈ హీరోలందరు డబ్బులిచ్చి బౌన్సర్లను ఎందుకు పెట్టుకుంటున్నారు నాకు సమాధానం చెప్పు” అని అడిగారు. ఆ మాటలు విని నేను షాక్ అయ్యాను. అప్పుడు నేను అన్నాను.. ఇదే విషయాన్ని ఎక్కడైనా చెప్పండి సార్.. ప్రపంచానికి తెలుస్తోంది అని అంటే.. నేను చెప్పను.. నేనేంటో నా ఫ్యాన్స్ కు తెలుసు.. వాళ్లెంటో నాకు తెలుసు అని చెప్పారు.. అంత గొప్ప మనిషి ఆయన అని బాలయ్య గురించి చెప్పుకొచ్చారు. ఇక సాయి మాధవ్ మాటలు విన్న బాలయ్య అభిమానులు.. అది రా మా బాలయ్య గొప్పతనము.. తొడగొట్టి, కాలర్ ఎత్తి చెప్తున్నాం మేము బాలయ్య అభిమానులము.. జై బాలయ్య అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

follow us