సాయి శ్రీనివాస్ బెల్లంకొండ ఛత్రపతి రీమేక్ కు డైరక్టర్ ఫిక్స్ !

  • Written By: Last Updated:
సాయి శ్రీనివాస్ బెల్లంకొండ ఛత్రపతి రీమేక్ కు డైరక్టర్ ఫిక్స్ !

“అల్లుడు శ్రీను” సినిమాతో పరిచయం అయిన సాయి శ్రీనివాస్ తక్కువ కాలంలోనే మంచి పేరును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో “అల్లుడు అదుర్స్” అనే చిత్రంలో నటిస్తున్నాడు. బెల్లం కొండ నటించిన తెలుగు సినిమాలు హింది డబ్బింగ్ వెర్షన్ లో రికార్డ్స్ సృస్టిస్తున్నాయి. అదే ప్రేరణతో ఎప్పటి నుండో బాలీవుడ్ లోకి అడుగు పెట్టాలని చూస్తున్నాడు. అందుకు ఓ మంచి కథ కోసం చాలా కాలం వరకు వెయిట్ చేశాడు. అవేమీ నచ్చకపోవడంతో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా వచ్చిన “ఛత్రపతి” చిత్రాన్ని హిందీలో రీమేక్ చెయ్యడానికి సిద్దం అయ్యాడు.

తనకు మొదటి చిత్రంతో సూపర్ హిట్ ని ఇచ్చిన వి.వి వినాయక్ తో “ఛత్రపతి” సినిమాను రీమేక్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఆ చిత్రంను పెన్ స్టూడియోస్ నిర్మించన్నున్నది. ఆ చిత్రంలో వచ్చే క్లైమాక్స్ , ఇంటెర్వెల్ యాక్షన్ సీన్స్ చేంజ్ చేస్తూ ఇప్పటి నేటివిటీ కి తగిన విదంగా మార్పులు చేర్పులు చేయాలని ఓరిజినల్ ఛత్రపతికి కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ కి రీమేక్ కథ బాద్యతలు అప్పగించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ను కథానాయకిగా తీసుకొనున్నారు.

follow us