అఫీషియల్: ‌వరుణ్ తేజ్ తో ‘ద‌బాంగ్’ బ్యూటీ

  • Written By: Last Updated:
అఫీషియల్: ‌వరుణ్ తేజ్ తో ‘ద‌బాంగ్’ బ్యూటీ

కిర‌ణ్ కొర్ర‌పాటి డైరెక్ష‌న్ లో యంగ్ హీరో వ‌రుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్ రోల్ లో న‌టిస్తున్నాడు. ఈ రోల్ కోసం ఇప్ప‌టికే నిపుణుడి స‌మ‌క్షంలో శిక్ష‌ణ కూడా తీసుకున్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ప‌లువురు బాలీవుడ్ భామ‌ల పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. వ‌రుణ్ తేజ్ తో రొమాన్స్ చేయ‌నున్న ఆ బ్యూటీ ఎవ‌ర‌నే దానిపై ఓ క్లారిటీ వ‌చ్చింది. స‌ల్మాన్ ఖాన్ న‌టించిన ‘ద‌బాంగ్’ తో సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసింది స‌యీ మంజ్రేక‌ర్. కాగా వరుణ్ తో ఈ సినిమా తెలుగులో ఆమెకు మొద‌టి చిత్రం. ఈ భామ‌ను వ‌రుణ్ తేజ్ చిత్రంలో హీరోయిన్ గా ఫైన‌ల్ చేశారు మేక‌ర్స్. స‌యీ మంజ్రేక‌ర్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ రెనైసేన్స్ పిక్చ‌ర్స్ ఈ విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేసింది.

follow us