సూపర్ స్టార్ మహేష్ మూవీ లో సైఫ్‌ అలీఖాన్‌..?

సూపర్ స్టార్ మహేష్ మూవీ లో సైఫ్‌ అలీఖాన్‌..?

బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా తరహా లో సినిమాలు రిలీజ్ అవుతుండడం బ్లాక్ బస్టర్ విజయాలు అవుతుండడం తో.. ఇతర భాషల అగ్ర నటి నటులు సైతం తెలుగు సినిమాల్లో నటించేందుకు ఉత్సహం చూపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా మూవీ లో బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ను ఎంపిక చేయాలనీ చూస్తున్నారట.

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో అతడు , ఖలేజా మూవీస్ వచ్చి విజయాలు సాధించగా..ఇప్పుడు మరోసారి వీరి కాంబో అనగానే అంచనాలు తారాస్థాయి కి చేరాయి. ప్రస్తుతం ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ..త్వరలో రెండో షెడ్యూల్ మొదలుచేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం బాలీవుడ్‌ యాక్టర్‌ సైఫ్‌ అలీఖాన్‌ను ఎంపిక చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఇదే గనుక నిజమైతే సైఫ్‌ అలీఖాన్‌కు తెలుగులో ఈ చిత్రం రెండవది అవుతుంది. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్‌.. ప్రభాస్‌తో కలిసి ఆదిపురుష్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘SSMB28’ చిత్రాన్ని హారిక& హాసిని క్రియేషన్స్‌ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు. మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. శ్రీలీల సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మ్యూజిక్‌ సెన్సేషన్ థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్‌ అవుట్ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడట.

follow us