ఆదిపురుష్‌ లో లంకేష్ మంచివాడిగా కనిపిస్తాడట !!

ఆదిపురుష్‌ లో లంకేష్ మంచివాడిగా కనిపిస్తాడట  !!

సాహో తర్వాత ప్రభాస్ రాధా కృష్ణ డైరెక్షన్ లో రాధే శ్యామ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తుంది. ఈ చిత్రం తర్వాత మరో మూడు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. అందులో ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్‌ అనే పాన్ ఇండియా చిత్రం చెయ్యాలిసి ఉంది. ఈ చిత్రంలో రాముడి గా ప్రభాస్ నటిస్తున్నాడు. రావనుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఇందులో రావనుడి పాత్రపేరు లంకేష్.

ఈ చిత్రంలోని తన పాత్రపై సైఫ్ అలీఖాన్ ఓ క్లారీటీ ఇచ్చాడు. ఆ చిత్రంలో పేరుకు మాత్రమే ఆ పాత్ర పేరు లంకేష్ అని ఆ పాత్రకు మానవతా విలువలు ఉంటాయి అన్నారు. లక్ష్మణుడు శూర్పణక ముఖు కోసినప్పుడు లంకేష్ మానవతా విలువలు పాటిస్తాడు అని అన్నాడు. ఈ చిత్రంలో సీత పాత్ర కోసం దర్శకుడు పలు బాలీవుడ్ హీరోయిన్స్ ను పరిశీలిస్తున్నాడు. త్వరలో సీత పాత్రపై ఓ క్లారీటి రానున్నది.

follow us