ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తాం…

Sajjala Ramakrishna Reddy over AP Special Status
Sajjala Ramakrishna Reddy over AP Special Status

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను ఎప్పటికైనా సాధిస్తామని తెలిపారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… హోదా విషయంలో కేంద్రం చెబుతున్న కారణాలు సరైనవి కాదన్న ఆయన.. ప్రతీ వేదికపై ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ అంశాన్ని సంజీవంగా ఉంచుతున్నామన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను వదిలిపెట్టే ఉద్దేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు సజ్జల.. ఈ అంశం ఏదో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నది కాదు.. పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు.. అక్కడ ఇచ్చిన హామీ చట్టానికంటే ఎక్కువైందన్నారు.