అంత బాధలో కూడా అభిమానులను పలకరించిన సామ్..ట్వీట్ వైరల్

  • Written By: Last Updated:
అంత బాధలో కూడా అభిమానులను పలకరించిన సామ్..ట్వీట్ వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకొంటుంది. సామ్ గురించి ఏ వార్త వచ్చినా సంచలనమే. గత కొన్నిరోజులుగా ఆమె సినిమాలకు బ్రేక్ చెప్తుందని కొందరు.. సౌత్ కొరియా వెళ్లి చికిత్స తీసుకుంటుంది అని మరికొందరు చెప్పుకొస్తున్నారు.ఈ వార్తలపై సం మేనేజర్ స్పందించి అందులో ఎటువంటి నిజం లేదని చెప్పుకు రావడం తో వాటికి చెక్ పడింది. ఇక ఈ వ్యాధి గురించి బయటికి తెలిసిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో సామ్ చాలా తక్కువగా కనిపిస్తోంది దీంతో ఆమె అభిమానులు ఆమె హెల్త్ గురించి ఆందోళన చెందుతున్నారు. కాగా, వారి కోసం అప్పుడప్పుడు సామ్ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ వారికి దగ్గరగా ఉంటుంది.

ఇక తాజాగా సామ్ తన అభిమానులందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది. “మీరు చేయగలిగిన వాటినే కంట్రోల్ చేయండి.. కొత్త కోరికలను, సులభమైన లక్ష్యాలను ఎంచుకోవడం కోసం ఇదే సరైన సమయం. మనకు సాధ్యమయ్యే లక్ష్యాలను ముందే నిర్దేశించుకోండి.. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉంటాయి.. అడ్వాన్స్ హ్యపీ న్యూ ఇయర్ 2023” అని ట్వీట్ చేసింది. ఇక దీంతో పాటు ఆమె ప్రజెంట్ ఫోటోను కూడా షేర్ చేసింది. మేకప్ లేకుండా కూడా సామ్ అందంగానే ఉంది కానీ.. అంతకు ముందు ఉన్న కళ మాత్రం లేదని కనిపిస్తోంది. ఏది ఏమైనా సామ్ త్వరగా కోలుకుని మళ్లీ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

https://twitter.com/Samanthaprabhu2/status/1608431314889498624?t=fvAZFG5rkZqgfQUGlO9B_A&s=19

follow us