శాకుంతలం అప్డేట్ వచ్చేసిందోచ్

శాకుంతలం అప్డేట్ వచ్చేసిందోచ్

హమ్మయ్య.. ఎట్టకేలకు సమంత మళ్లీ ఫార్మ్ లోకి రాబోతోంది. గత కొన్నిరోజులుగా మయోసైటిస్ వ్యాధితో ఇంటికే పరిమితమైన సామ్ ఎట్టకేలకు బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది. దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన శాకుంతలం ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ప్రకటించింది. గతేడాదినే ఈ సినిమా ప్రేక్షకుల ముందు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన ఆలస్యమైంది. శకుంతల- దుశ్యంతుల ప్రేమ కథను ఎంతో హృద్యంగా గుణశేఖర్ తెరకెక్కించాడు. ఈ సినిమాను గుణశేఖర్ టీంవర్స్క్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మిస్తుండగా.. నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా ఉన్నాడు.

ఇక ఈ చిత్రం లో దుశ్యంతుడు గా మలయాళ హీరో దేవ్ మోహన్ తెలుగుకు పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా, ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన హిందీ తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు ఒక కొత్త పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో శకుంతల- దుశ్యంతులు ప్రేమ మైకంలో మునిగిపోయినట్లు కనిపిస్తున్నారు. గతేడాది యశోద సినిమా ప్రమోషన్స్ కు వ్యాధి కారణంగా సామ్ సరిగ్గా హాజరుకాలేదు. ఇప్పుడు ఆమె కొద్దికొద్దిగా కోలుకొంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి సామ్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో సామ్ ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

follow us