“ఆకాశమే నీ హద్దురా” సినిమా పై సమంత పొగడ్తల వర్షం !

“ఆకాశమే నీ హద్దురా” సినిమా పై సమంత పొగడ్తల వర్షం !

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన “ఆకాశమే నీ హద్దు రా” అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన సంగతి తెలిసిందే. కెప్టెన్ జిఆర్. గోపినాథ్ జీవిత కథను ఆదారంగా తీసుకుని లేడి దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించారు. ఈ చిత్రంలో గోపినాథ్ పాత్రలో సూర్య నటించగా ఆయన భార్య పాత్రలో అపర్ణ బాలమురళి నటించింది.

ఈ చిత్రంలో సూర్య నటనకు విమర్శకులనుండి ప్రశంసలు వస్తున్నాయి. సింగం సిరీస్ తరువాత సూర్య నటించిన చిత్రాలు వరసగా ఫ్లాప్స్ అవ్వడంతో కెరీర్ లో కాస్త వెనకపడిన సూర్యకు ఈ చిత్రం విజయంతో మరల ట్రాక్ లోకి వచ్చాడు. అపర్ణ బాలమురళి ఈ చిత్రంలోని తన యాక్టింగ్ కు తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. టాలీవుడ్ నటి అక్కినేని సమంత ఆకాశమే నీ హద్దు రా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

“ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ సినిమా అంటూ సూర్య అద్బుతంగా నటించారు. ఆయన తన పాత్రలో జీవించేశాడు. సుధా కొంగర టేకింగ్ సూపర్ అపర్ణ బాలమురలికి ఇది మొదటి సినిమా అయిన ఔట్స్టాండింగ్ పర్ఫార్మెంస్ ఇచ్చింది. ఈ చిత్రం నాకు ఓ అదర్శ్యం నాకు కావాసిన అన్నీఅంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి అంటూ ట్వీట్ చేసింది.

follow us