సమంత ఆరోగ్యం విషమం ఫై క్లారిటీ

సమంత ఆరోగ్యం విషమం ఫై క్లారిటీ

సమంత గత కొద్దీ రోజులుగా మయోసైటిస్‌ అనే వ్యాధి తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చాల అరుదుగా అతి తక్కువ మందికి సోకే ఈ వ్యాధి సమంత కు సోకి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ వ్యాధి కారణంగా సినిమాలు చేయడం తగ్గించింది. రీసెంట్ గా యశోద మూవీ టైం లోకూడా చాల ఇబ్బంది పడుతూనే సినిమా పూర్తి చేసింది. ఇప్పుడు ఈ వ్యాధి ప్రమాద స్థాయికి చేరిందని, ఈ వ్యాధి నుండి కోలుకోవడం కోసం సమంత దక్షిణ కొరియా వెళ్తున్నారని , అక్కడే కొన్ని నెలల పాటు ఉండి, చికిత్స తీసుకోబోతున్నారని ఇలా అనేక వార్తలు సోషల్ మీడియా లో , మీడియా చానెల్స్ లలో ప్రసారం కావడం తో ఆమె అభిమానులు కంగారు పడుతున్నారు.

ఈ క్రమంలో ఆమె టీం ఈ వార్తల ఫై క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ కొట్టి పారేసింది. సమంత ఆరోగ్యంగా ఉన్నారని, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఇక్కడే చికిత్స తీసుకుంటూనే సినిమాల ఫై ఫోకస్ చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీ లో నటిస్తుంది. శివ నిర్వాణ ఈ చిత్రానికి డైరెక్టర్.

follow us