టాలీవుడ్ సెలబ్రేటీస్ కి ఓ వరంలా కనిపిస్తున్న సమంత “సామ్ జామ్” !

  • Written By: Last Updated:
టాలీవుడ్ సెలబ్రేటీస్ కి ఓ వరంలా కనిపిస్తున్న సమంత “సామ్ జామ్” !

“ఆహా” లో సమంత “సామ్ జామ్” అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ రాగా అంతగా ఆకట్టుకోపోగా అన్నీ షోస్ లాగే రొటీన్ టాక్ షో అనే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత “సామ్ జామ్” టాక్ షో లో స్క్రిప్ట్ చేంజ్ చెయ్యడంతో ఆ తర్వాత ఎపిసోడ్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రానా, నాగ్ అశ్విన్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ అందరికి ఎప్పుడు గుర్తుండిపోతుంది. బాహుబలి సినిమాలో రానా ఏవిదంగా కనిపించాడో మనందరికి తెలుసు ఓ హల్క్ కి బాబుల ఉన్న ఆయన, బాడి ఒక్కసారిగా బక్క చిక్కి సన్నని పుల్లలగా మారడంతో సోషల్ మీడియాలో రానా హెల్త్ పై అనేక రకాల వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన కొంతకాలానికి రికవరీ అయినా, ఎందుకు అలా మారాడో ఆయనకు వచ్చిన జబ్బు గురించి మాత్రం రానా ఎక్కడ చెప్పలేదు. కొన్ని వారాల కిందట ఆహా కు రానా గెస్ట్ వచ్చినప్పుడు సమంత రానా హెల్త్ పై వస్తున్న గాసిప్స్ అడగగా… రానా నాకు చిన్నపాటి నుండి హెల్త్ ప్రాబ్లమ్ ఉంది.

కెరీర్ లో మంచి ఫిక్స్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ రోగం నన్ను ఇబ్బంది పెట్టింది అంటూ ఆయన హెల్త్ కండిషన్ గురుంచి చెప్పి అన్నీ పుకార్లకు చెక్ పెట్టాడు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్. దర్శకుడు క్రిష్ కూడా సామ్ జామ్ టాక్ షో కి అతిదులుగా రావడం జరిగింది. ఆ ఎపిసోడ్ లో రకుల్ పై వస్తున్న గాసిప్స్ గురుంచి అడిగి వాటికి ఫుల్ స్టాప్ పెట్టెల చేసింది. అలాగే క్రిష్ ను కూడా మణికర్ణిక చిత్రంపై వచ్చిన పుకార్లకు క్రిష్ వివరణ ఇవ్వడంతో అక్కడితో మణికర్ణిక విషయంలో జరిగిన వివాదానికి క్రిష్ చెక్ పెట్టాడు. టాలీవుడ్ సెలబ్రేటీస్ కి సమంత సామ్ జామ్ టాక్ షో ఓ వరంలా వారికి కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నాడని సోషల్ మీడియా నుండి అందుతున్న సమాచారం. త్వరలోనే అసలు విషయం తెలియనున్నాది.

follow us