కేజీ ద‌ర్శ‌కుడితో సందీప్ మ‌రో సినిమా ..!

  • Written By: Last Updated:
కేజీ ద‌ర్శ‌కుడితో సందీప్ మ‌రో సినిమా ..!

టాలీవుడ్ యంగ్ హీరో ఎప్పుడూ విభిన్న క‌థ‌ల‌తో వ‌స్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ఉంటారు. తాజాగా మ‌రో విభిన్న‌మైన సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సందీప్ సిద్ద‌మ‌వుతున్నారు. సందీప్‌కిషన్‌కు ‘టైగర్‌’ వంటి మంచి ప్రేక్షకాదరణ లభించిన సినిమాను అందించిన దర్శకుడు వీఐ ఆనంద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కాన్సెప్ట్‌ వైజ్‌గా దర్శకుడు వీఐ ఆనంద్‌కు, పెర్ఫార్మెన్స్ పరంగా సందీప్‌ కిషన్‌కు టైగ‌ర్‌ ఒక కొత్త త‌ర‌హా చిత్రం. ముఖ్యంగా సందీప్‌ కిషన్‌ పవర్‌ప్యాక్డ్‌ యాక్షన్‌ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్‌ చేసిందని చెప్పవచ్చు.

కాగా ఆరు సంవ‌త్స‌రాల త‌ర‌వాత మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో సినిమా రాబోతుంది. ఇక మే 7 ఈరోజు సందీప్ కిష‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ ప్రాజ‌క్టును అనౌన్స్ చేశారు. అంతే కాకుండా అనౌన్స్‌ మెంట్‌ పోస్టర్‌లో సందీప్‌కిషన్‌ ఏదో ఒక మిస్టీరియస్‌ లొకేషన్‌ను ఐడెంటీఫై చేస్తున్నట్లుగా క‌నిపిస్తున్నారు. ఈ సినిమాను హాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండ నిర్మిస్తున్నారు. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గిన త‌ర‌వాత సినిమా షూటింగ్ ను మొద‌లు పెట్ట‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. న‌టీన‌టుల వివ‌రాల‌ను సైతం త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

follow us