సందీప్ కిష‌న్ ఏ1 ఎక్స్‌ప్రెస్ రివ్యూ..!

sandeep kishans a1 express movie review sandeep kishans a1 express movie review
sandeep kishans a1 express movie review sandeep kishans a1 express movie review

సందీప్ కిష‌న్ తన కెరీర్ లోనే మొద‌టిసారి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేసాడు. అదే ఏ1 ఎక్స్ ప్రెస్‌. ఈ చిత్రంలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. సినిమా‌ను త‌మిళంలో సూపర్ హిట్ గా నిలిచిన నాప్టే తునై అనే సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కించారు. తమిళ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. ఇక ఇప్పటికే సినిమా టీజ‌ర్ మ‌రియు ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకోగా శుక్ర‌వారం ఈ సినిమా విడుద‌లై ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అయ్యిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం.

క‌థ :సందీప్ కిష‌న్ కు సినిమాలో హాకీ అంటే చాలా ఇష్టం. దాంతో అదే క్రీడను త‌న కెరీర్ గా మ‌లుచుకోవాల‌ని డిసైడ్ అవుతాడు. అంతే కాకుండా కలలు కన్నట్టుగానే హాకీలో రాణించి జాతీయ స్థాయి వ‌ర‌కు చేరుకుంటాడు. కానీ ఈ క్ర‌మంలో సందీప్ కు ఎదురైన కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల నిరాశ చెందుతాడు. దాంతో లైఫ్ లో త‌న‌కు స‌క్సెస్ దొరక‌ద‌ని భావించి లోక‌ల్ జ‌ట్టులో ఆడ‌టం మొద‌లు పెడ‌తాడు. అయితే ఈ క్ర‌మంలో సందీప్ ఫ్రాన్స్ వెళ్ళాల‌ని చాలా క‌ష్ట‌ప‌డుతుంటాడు. ఈస‌మ‌యంలోనే హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి ప‌రిచ‌యం అవుతుంది. ఆ ప‌రిచ‌యం కాస్తా ప్రేమగా మారుతుంది. లావ‌ణ్య తో ప్రేమ ద్వారా సందీప్ హాకీ కోచ్ గా మారిపోతాడు. కాగా క్రీడా కారులు ఆడుకునే హాకీ మైదానం పై కార్పొరేట్ క‌న్ను ప‌డుతుంది. దాంతో కార్పొరేట్ కంపెనీల నుండి మైదానం ను కాపాడుకోవ‌డానికి ఏం చేసాడు..మైదానాన్ని కాపాడాడా లేదా..కాపాడుకునే క్ర‌మంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుకున్నాడ‌న్న‌దే సినిమా క‌థ‌.

క‌థ‌నం : త‌మిళంలో సూపర్ హిట్ అయ్యిన నాప్టే తునై ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు డెన్నిస్ జీవ‌న్ తెలుగులోనూ తెరకెక్కించాడు. కానీ తెలుగు నేటివిటి కి తగ్గట్టుగా కథలో దాదాపు 50శాతం పైగా మార్పులు చేశాడు. ఇదిలా ఉండ‌గా మైదానాన్ని కాపాడుకునే నేప‌థ్యంలో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. నితిన్ ” సై” సినిమా కూడా లాంటిదే. కానీ తెలుగులో హాకీ నేప‌థ్యంలో సినిమా రావ‌డం ఇదే తొలిసారి. తెలుగులో క‌బ‌డ్డీ, క్రికెట్ నేప‌థ్యంలో చాలా సినిమాలు వ‌చ్చాయి కానీ. జాతీయ క్రీడ హాకీ నేప‌థ్యంలో సినిమా తీసి ద‌ర్శ‌కుడు మ‌న ఆట‌ను గుర్తు చేసాడు.ఇక ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లోనే ప‌ట్టు సాధించింది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ చిత్రానికి ప్ల‌స్ పాయింట్ అయ్యింది. అయితే హీరోయిన్ రొమాంటిక్ స‌న్నివేశాలు ఉండాలి కాబ‌ట్టి లావ‌ణ్య త్రిపాఠి ని సినిమాలో భాగం చేసిన‌ట్టు అనిపించింది. మొత్తానికి హాకీని తెర‌పై చూపించిందేకు ద‌ర్శ‌కుడు త‌న టాలెంట్ ను వాడేశాడు.

పర్ఫామెన్స్ లు : ఈ సినిమాలో హీరోగా నటించిన సందీప్ కిషన్ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించాడు. ఈ సినిమా సందీప్ కు సిల్వర్ జూబ్లీ 25వ సినిమా కాగా తన ఎఫర్ట్ అంతా పెట్టి సినిమాలో నటించాడు. ఇక హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి కూడా తన పరిధి మేరకు అలరించింది. ఒక్కమాటలో చెప్పాలంటే జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో తెలుగులో ఇప్పటివరకు సినిమాలు రాలేదు..కాబట్టి టాలీవుడ్ ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందే అవకాశం ఉంది. ఇక సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతే మాత్రం సినిమా మంచి విజయం సాధించే అవకాశం ఉంది.