A1 ఎక్స్ప్రెస్ ట్రైలర్ టాక్…ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా

sandeep kishans a1 express movie trailer
sandeep kishans a1 express movie trailer

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా “A1 ఎక్స్ ప్రెస్”. ఈ సినిమాకు డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో సందీప్ కిషన్ కు హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తోంది. ఇక ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. సినిమాలో సందీప్ కిషన్ హాకీ క్రీడకరుడిగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం సందీప్ కిషన్ ఫుల్ గా వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీని పెంచాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ లు ఆకట్టుకోగా తాజాగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా గా కనిపిస్తోంది. క్రీడలపై బిసినెస్ మ్యాన్ ల పెత్తనం ఎలా ఉంటుందో సినిమాలో చూపించనున్నారు. వాటిని సందీప్ కిషన్ ఎలా అధిగమించి తన ఆటలో గెలుస్తాడన్నది ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇక సినిమాలో “సింగిల్ కింగులం” అన్న సాంగ్ ఉన్నప్పటికీ లావణ్య, సందీప్ కిషన్ మధ్య నడిచే లవ్ ట్రాక్ కూడా ఉందని స్పష్టం అవుతోంది. మొత్తానికి సినిమా ట్రైలర్ పక్కా సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ ను పెంచేలా ఉంది. ఇక ట్రైలర్ లో సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.