“గల్లీ రౌడీ” టీజర్ విడుదల..!

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం గల్లీ రౌడీ. ఈ సినిమాకు నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడీగా నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా చౌరస్తా రామ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ తాతలు, తండ్రి రౌడీ కావడంతో సందీప్ ను కూడా రౌడీని చేయాలని కుటుంబ సభ్యులు కోరుకుంటారు.
కానీ సందీప్ కు మాత్రం రౌడీ అవ్వడం ఇష్టం ఉండదు. కానీ అనుకోని కారణాల వల్ల సందీప్ రౌడీ గా మారతాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ తో కామెడీ ఒక రేంజ్ లో ఉండబోతుందని అర్థం అవుతుంది. అంతే కాకుండా రాజేంద్రప్రసాద్ కామెడీ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. దాంతో ఆయతో కూడా కామెడీ పండుతుందని తెలుస్తోంది. ఇక టీజర్ చూస్తుంటే సినిమా ఫుల్ గా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందని కనిపిస్తోంది. ఇక ఈ టీజర్ ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా విడుదల చేశారు.