రూట్ మార్చిన జార్జ్ రెడ్డి..

  • Written By: Last Updated:
రూట్ మార్చిన జార్జ్ రెడ్డి..

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మీ చిత్రంతో నటుడిగా పరిచయం అయిన సందీప్ మాదవ్. నటుడిగా నిరూపించుకున్నాడు. విజయవాడ కు చెందిన మాస్ లీడర్ వంగవీటి రాధా బయోపిక్ ను రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వంగవీటి అనే చిత్రంలో నటించాడు. అప్పటి నుండి బయోపిక్ లకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు. ఆ తరువాత జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఉస్మానియా యునివర్సిటి కి చెందిన స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి జీవిత కథను “జార్జ్ రెడ్డి” టైటిల్ రోల్ నటించి మెప్పించాడు. ఆ చిత్రం తరువాత చాలాకాలం వరకు సినిమాలు దూరంగా ఉన్నాడు.

దర్శక నిర్మాతలు కూడా తన వద్దకు బయోపిక్ కథలతో వస్తు ఉండటంతో విసుగు చెందిన సందీప్ ఈసారి ఎలాగైనా రూట్ మార్చి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే రొమాంటిక్ కథతో ముందుకు వస్తున్నాడు. మధు కిరణ్ అనే కొత్త డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడం తో పచ్చ జెండా ఉపాడు. ఈ చిత్రంను హల్సియన్ మూవీ పతాకంపై నూరపనేని అరుణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. డిసెంబర్ నుండి రెగ్యూలర్ షూటింగ్ మొదలు అవ్వనున్నది.

follow us