కేజీఎఫ్ 2 లేటెస్ట్ అప్డేట్

  • Written By: Last Updated:
కేజీఎఫ్ 2 లేటెస్ట్ అప్డేట్

కన్నడ రాక్ స్టార్ యష్ ను ఓవర్ నైట్ స్టార్ ను చేసిన చిత్రం “కేజీయఫ్” ఈ చిత్రం తెలుగు, తమిళ్, హింది బాషలో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో నటించిన అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. “కేజీయఫ్” సీక్వెల్ గా “కేజీయఫ్ చాప్టర్ 2” ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం కరోనా నిబందనలు పాటిస్తూ షూటింగ్ జరుపుకుంటుంది. ఆ చిత్రంలో రాకీ బాయ్ పాత్రలో నటించిన యష్ కు మంచి గుర్తింపు తెచ్చింది. అన్నీ బాషల్లోనూ యష్ కు మంచి మార్కెట్ ఏర్పడింది.

“కేజీయఫ్ 2” లో విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. కాన్సర్ బారిన పడి చాలా రోజులవరకు షూటింగ్ కు దూరం గా ఉంటూ వస్తున్నాడు. తాజా సమాచారం మేరకు డిసెంబర్ 6 నుండి రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొనడానికి సంజయ్ రెడీ అవ్వుతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఆధీర అనే పాత్రలో నటిస్తున్నాడు. రాకీ బాయ్, యష్ ల మద్య కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. డిసెంబర్ లో జరిగే ఆఖరి షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి అవ్వుతుంది.

follow us