సర్కారు వారి పాట : మహేశ్ బర్త్ డేకి టీజర్ లేనట్టే కానీ ఆ ట్రీట్ పక్కా .!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా మహానటి కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా టీజర్ పై కొద్ది రోజులనుండి వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు బర్త్ డే మే 31న సినిమా టీజర్ విడుదల చేస్తారని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ ను మహేష్ బర్త్ డే కి విడుదల చేయడం లేదట.
ప్రస్థుతం కరోనా ఉధృతి సమయంలో ఎంతో మంది ఇబ్బందులు పడుతుంటే టీజర్ విడుదల చేయకూడదని భావించారట. అయితే బాబు ఫ్యాన్స్ ను హర్ట్ చేయకుండా ఓ మేకింగ్ వీడియోను మాత్రం వదలబోతున్నారట. అంతే కాకుండా ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా వదిలే అవకాశం ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.