సరిలేరు నీకెవ్వరు టీజర్: పండక్కి అల్లుడు వస్తాడు అనుకుంటే మొగుడు వస్తున్నాడు.

మహేష్ బాబు సంక్రాతి రిలీజ్ సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదల అయ్యింది.. ఇప్పటి దాకా ప్రొమోషన్స్ చెయ్యని టీం ఈ టీజర్ తో ఫ్యాన్స్ కి ఒక్కసారి గా బూస్ట్ ఇచ్చినట్టు అయ్యింది.. రష్మిక మందన్న ని మాత్రం టీజర్ లో చూపించలేదు.. ప్రొమోషన్స్ లో భాగం గా ఆమె కోసం ఇంకో సారి ఒక చిన్న కట్ రిలీజ్ చేస్తారు అని వినికిడి..

ఇంకా టీజర్ లో విజయశాంతి , ప్రకాష్ రాజ్ ని చూపించారు.. వాళ్ళ వరకు వాళ్ళు బాగానే మెప్పించారు టీజర్ లుక్స్ తో సింగల్ డైలాగ్ తో. మహేష్ బాబు దేశ భక్తిని ఒక డైలాగ్. లో . అంతే చెప్పుకోడానికి ఇంకా ఏం లేదు. ఆర్మీ మేజర్ అని అందరకి తెలిసిందే , ఫ్యాన్స్ కి మాత్రం ఒక బూస్ట్ ఇచ్చింది ఈ టీజర్.. 

ఏది ఏం అయినా బాక్స్ ఆఫీస్ కి మొగుడు వచ్చాడు.. మరి ఆ మొగుడు నిలబడతో లేక పండగ రోజు కలెక్షన్స్ చూసుకొని వెనకకి వెళ్ళిపోతాడో.. చూడాలి మరి ..