రవితేజ ఫ్యాన్స్ కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన షకలక శంకర్

రవితేజ ఫ్యాన్స్ కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన షకలక శంకర్

మాస్ రాజా రవితేజ అభిమానులకు నటుడు షకలక శంకర్ క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. సినిమాల ఫై ఇంట్రస్ట్ తో హైదరాబాద్ కు వచ్చిన షకలక శంకర్ ..ఆఫీస్ బాయ్ గా, ప్రొడక్షన్ బాయ్ గా పనిచేసి.. రన్ రాజా రన్ సినిమా దర్శకుడు సుజిత్..తన షార్ట్ ఫిలిం లో శంకర్ కు ఛాన్స్ ఇచ్చారు. ఆ తరువాత ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో చలాకీ చంటి బృందంలో సభ్యుడిగా ప్రవేశించాడు. తరువాత షకలక శంకర్ పేరుతో తనే సొంతంగా ఓ బృందం కూడా నడిపాడు. ప్రముఖ రాం గోపాల్ వర్మ ను అనుకరించడం, తనదైన శ్రీకాకుళం యాసతో, పవన్ కల్యాణ్ అభిమానిగా ఓ పాటను పాడటం లాంటి విలక్షణ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ పాపులార్టీ తో సినిమా ఛాన్సులు రావడం..క్యారెక్టర్ అరెస్ట్ నుండి ఏకంగా హీరో ఛాన్సుల వరకు రావడం తో షకలక శంకర్ మరింత పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఈయన..తాజాగా నిర్మాత బండ్ల గణేష్ ను విమర్శించి వార్తల్లో నిలిచాడు.

మాస్ రాజా రవితేజ నటించిన ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం తో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ కు చిత్ర యూనిట్ తో పాటు బండ్ల గణేష్ , హరీష్ శంకర్ వంటి వారు సైతం హాజరయ్యారు. మాములుగా బండ్ల గణేష్ స్పీచ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్కరి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అలాంటి గణేష్ ధమాకా సక్సెస్ మీట్ లో రవితేజ ను ఆకాశానికి ఎత్తేసాడు.

‘ఎప్పటికీ అస్తమించని రవితేజ గురించి మాట్లాడాలని వచ్చాను. రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు..రవితేజ హానెస్టీ సిన్సియారిటీ రెస్పాన్సిబులిటీ రవితేజ ఎవ్రీథింగ్ ఫర్ ఆన్సర్ బులిటీ..రవితేజ ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి గర్వం వుండాలి అన్నాడు. అంతే కాకుండా రవితేజ చేసిన 70 సినిమాల్లో 12 మంది కొత్త దర్శకులని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ.. కష్టం తెలిసిన వాడు రవితేజ..అందరూ వన్ ఇయర్ టు ఇయర్.. త్రీ ఇయర్స్ ట్రై చేస్తారు…అదృస్టం కలిసొచ్చి సూపర్ స్టార్లు మెగాస్టార్లు కూడా అవుతారు.. అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. మెగాస్టార్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ బండ్లన్నపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలపై కమెడియన్ షకలక శంకర్ కౌంటర్ ఇచ్చాడు. ఊర‌క‌నే మెగాస్టార్‌, సూప‌ర్ స్టార్ అయిపోర‌ని, మైక్ చేతిలో ఉండి, ఎవ‌డో హీరో నీ ముందుంటే ఉబ్బిపోయి అలా మాట్లాడుతావా! అని ఘాటుగా స్పందించారు.

ష‌క‌ల‌క శంక‌ర్ .. ర‌వితేజ‌ను ఎవ‌డో అనేశాడు. దానిపై ర‌వితేజ ఫ్యాన్స్ సీరియ‌స్ అయ్యాడు. మా హీరోనే అంటావా అంటూ ష‌క‌ల‌క శంక‌ర్‌పై కామెంట్స్ రూపంలో విరుచుకుప‌డ్డారు. విష‌యం తెలియ‌గానే శంక‌ర్‌.. ర‌వితేజ‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఫ్లోలో ఏదో వీడు అనేశాను. క్ష‌మించండి.. ర‌వితేజ ఫ్యాన్స్‌కి థాంక్స్ అని త‌న వీడియోలో ష‌క‌ల‌క శంక‌ర్ వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. అయితే షకలక శంకర్ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ ఇంకా రియాక్ట్ కాలేదు. మరి గణేష్ ఎలా రియాక్ట్ అవుతాడనేది చూడాలి.

follow us