టిఆర్ఎస్ ఫై గవర్నర్ కు పిర్యాదు చేసిన షర్మిల

టిఆర్ఎస్ ఫై గవర్నర్ కు పిర్యాదు చేసిన షర్మిల

YSRTP అధినేత వైస్ షర్మిల ..తెలంగాణ గవర్నర్ తమిళ సై ని కలిసి టిఆర్ఎస్ పార్టీ తీరు ఫై పిర్యాదు చేసింది. గత కొద్దీ రోజులుగా షర్మిల ప్రజా యాత్ర పేరుతో పాదయాత్ర చేపడుతూ ప్రజల కష్టాలను తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక జిల్లాలో యాత్ర చేపట్టి..అక్కడి అధికార పార్టీ నేతల ఫై విమర్శలు చేసింది. తాజాగా వరంగల్ జిల్లా నర్సం పేట లో స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఫై పలు విమర్శలు చేయడం తో..టిఆర్ఎస్ కార్య కర్తలు ఆమె వాహనాన్ని తగలపెట్టి , నానా రచ్చ చేసారు. ఈ క్రమంలో షర్మిల ను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తరలించారు.

మంగళవారం షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి ట్రై చేయడం తో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు. దీంతో పెద్ద గందరగోళం ఏర్పడింది. YSRTP కార్య కర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోలన చేపట్టారు. ఆ తర్వాత బెయిల్ ఫై బయటకు వచ్చిన షర్మిల..ఈరోజు గవర్నర్ ను కలిసి టిఆర్ఎస్ తీరుపై పిర్యాదు చేసారు. తెలంగాణలో తాజాగా జరిగిన పరిణామాలపై గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వేల్లో మా పార్టీకి చాలా ఆదరణ ఉందని తేలింది. అందుకే టీఆర్ఎస్ భయపడుతోంది. కావాలనే శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. అందుకే మా పార్టీ కార్యకర్తలను, మా మనుషుల్ని పోలీస్ స్టేషన్లో ఇష్టానుసారం కొట్టారని షర్మిల అన్నారు.

follow us

Related News