పెళ్ళికొడుకు కాబోతున్న శర్వా

  • Written By: Last Updated:
పెళ్ళికొడుకు కాబోతున్న శర్వా

టాలీవుడ్ స్టార్ హీరోలు రానా, నితిన్, నిఖిల్, పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారు అయ్యారు. మెగా డాటర్ నిహారికా ఎంగేజ్మెంట్ చేసుకుని, పెళ్ళికి సిద్దం అవ్వుతుంది. ఇప్పుడు వీళ్ళ బాటలో యువ నటుడు శర్వా వచ్చి చేరారు. శర్వానంద్ మొదట విలన్ గా, హీరో ఫ్రెండ్ గా, నటిస్తూ వచ్చాడు. ఆ తరువాత హీరో గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ స్టార్ డమ్ ను ఏర్పరుచుకున్నాడు. పడి పడి లేచే మనసు చిత్రం తరువాత శర్వా “శ్రీకారం” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.

యువ నటుడి శర్వా పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి. కానీ వాటికి బలమైన ఆధారాలు ఏవి లభించలేదు. తాజాగా మరోసారి అవే పెళ్లి వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చకర్లు కొడుతున్నాయి. స్నేహితురాలిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడని. ఈ జంట వాళ్ళ పెద్దలను ఓపించి వారు అంగీకారం తెలిపాకే పెళ్ళికి సిద్దం అవ్వుతున్నారని సమాచారం. శర్వా మాత్రం తన పెళ్లి వార్తలపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. తను మాత్రం కెరీర్ పైనే దృస్టి పెట్టినట్లుగా తెలుస్తుంది.

follow us