రాజశేఖర్ సరసన గ్లామరస్ బ్యూటీ..?

shriya saran
shriya saran

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ వరుసగా ‘గరుడ వేగ’, ‘కల్కి’ సినిమాలతో హిట్ కొట్టి ఊపు మీదున్నారు. ఇక ఇప్పుడు ఆయన తన తాజా చిత్రం పనిలో బిజీగా ఉన్నారు. కల్కి సినిమా తరువాత ‘మా’ వివాదాలతో తలమునకలైన రాజశేఖర్ తాజాగా వీరభ‌ద్ర‌మ్ అనే దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. చాలా రోజుల తరువాత రాజశేఖర్ ఈ సినిమా ఓకే చేయడంతో వీరభ‌ద్ర‌మ్ కూడా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నారు. 

ఇక ఈ సినిమాల్లో రాజశేఖర్ సరసన గ్లామరస్ బ్యూటీ శ్రియను తీసుకోవాలని చూస్తున్నారు. రాజశేఖర్ వయసు దృష్ట్యా  శ్రియ అయితే పర్ఫెక్ట్ గా సూటవుతుందని దర్శకుడు భావిస్తున్నాడట. పైగా ఆ పాత్ర హుందాగా, గ్లామ‌రస్‌ గా ఉంటుంద‌ట‌. అందుకే శ్రియ‌ని ఎంచుకోవాల‌ని చూస్తున్నారు. ఈ క‌థ‌లో మ‌రో యువ హీరో కూడా న‌టించ‌నున్నారు. ఆ హీరో ఎవ‌ర్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో రాజశేఖర్ హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి. .