లిప్‌లాక్ షేర్ చేసిన శ్రియ‌

  • Written By: Last Updated:
లిప్‌లాక్ షేర్ చేసిన శ్రియ‌

తెలుగులో దశాబ్దం కాలంపాటు స్టార్ స్టేటస్‌ను అనుభవించింది శ్రియా. తెలుగులో కుర్ర హీరోలతో మొదలుపెట్టి సీనియర్ హీరోలందరితో నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటివారికి సరిజోడుగా అనిపించుకున్న శ్రియా.. కుర్ర హీరోలతోనూ ఆడిపాడింది. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, పవన్ కళ్యాణ్ వంటివారితోనూ ఎన్నో బ్లాక్ బస్టర్‌ చిత్రాలను చేసింది. 2018లో ఆండ్రీ కొచీవ్ ను పెండ్లి చేసుకున్న ఈ భామ మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.

ఈ ఏడాది ఇన్ స్ట్రాగ్రామ్ ప్రొఫైల్ ను లిప్ లాక్ పిక్ పోస్టుతో షురూ చేసింది శ్రియా. త‌న భ‌ర్త ఆండ్రీతో లిప్‌లాక్ చేసిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన శ్రియ‌..అన్ని ముద్దులు, హ‌గ్స్ మీకు పంపిస్తున్నా అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ ఏడాది శ్రియ పెట్టిన మొద‌టి పోస్టు ఇదే కావ‌డం విశేషం. ఆండ్రీ కొచీవ్ ర‌ష్య‌న్ టెన్నిస్ ప్లేయ‌ర్‌. ఆర్గానిక్ ఫుడ్స్ చైన్ రెస్టారెంట్స్ ను కూడా నిర్వ‌హిస్తున్నాడు. రెస్టారెంట్ల ద్వారా తనకు వ‌చ్చిన లాభాల్లో కొంత భాగం సేవాకార్య‌క్ర‌మాల‌ను వినియోగిస్తుంటాడు ఆండ్రీ కొచీవ్‌. ఆండ్రీ కొచీవ్‌-శ్రియ మొద‌టిసారిగా మాల్దీవుల్లో క‌లిశారు.

follow us