శృతి హాసన్ బయోపిక్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ! అది ఏంటో మీకు తెలుసా ?

  • Written By: Last Updated:
శృతి హాసన్ బయోపిక్ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ ! అది ఏంటో మీకు తెలుసా ?

కమల్ హాసన్ కూతురు గా సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టిన శృతి హాసన్ తెలుగు, హింది, తమిళ్ లో హీరోయిన్ గా నటిస్తుంది. శృతి మొదట్లో చాలా సినిమాల్లో నటించిన ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. తండ్రి ఏమో లెజండరీ యాక్టర్ కూతురు ఏమో సినిమాల్లో ఐరెన్ లెగ్ అంటూ అప్పట్లో కామెంట్స్ కూడా చేశారు. శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకోవాలంటే బయపడే వాళ్ళు దర్శక, నిర్మాతలు. ఆమెకు మొదటి విజయం వచ్చింది పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం తోనే. అక్కడి నుండి ఐరెన్ లెగ్ కాస్త గోల్డెన్ లెగ్ గా మారింది. వరస సినిమా విజయాలతో దూసుకెళ్లింది. ఆ మధ్య రెండేళ్లు సినిమాలు దూరంగా ఉంది. ఆ సమయంలో తన ప్రియుడు (రష్యా కు చెందిన వ్యక్తితో) లవ్ బ్రేకప్ కావడమే సినిమా గ్యాప్ కు కారణం అని తెలుస్తుంది.

ఈ మధ్యనే శృతి మరల సినిమాలపై దృష్టి పెడుతుంది. అలాగే తన అభిమానులతో నిత్యం సోషల్ మీడియా వేధిక టచ్ లో ఉంటూ ఫోటోస్, సినిమా అప్డేట్, తన పర్శనల్ విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో లైవ్ లో అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్న మీ బయోపిక్ ను తెరపైకి ఎక్కిస్తే ఏ పేరు పెడతారు అని అడగగా జ్వాలాముఖి పేరు పెడతా అని శృతి హాసన్ సమాధానం ఇచ్చింది. ఇంకా నాకు పౌరాణిక పాత్రల్లో నటించాలంటే ఎక్కువ ఇష్టం. అలాగే హాలీవుడ్ మూవీ బ్యాట్‌మన్‌ మూవీ విలన్ తాలియా లాంటి పాత్రలను చెయ్యాలని ఉంది అంది. నేను సినిమాలోకి వచ్చే ముందు నాకు నటనపై ఎలాంటి ప్రావీణ్యం లేదు. నేను ఎక్కడ శిక్షణ తీసుకోలేదు అన్నారు.

follow us