ఒక్క రొమాంటిక్ పిక్ తో శృతి పుకార్లకు చెక్ పెట్టింది

శృతిహాసన్..కమల్ కూతురి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈమె..కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ తో ఐరెన్ అనే ముద్ర వేసుకుంది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ మూవీ తో హిట్ అందుకొని..అప్పటి నుండి మళ్లీ కెరియర్ లో వెనక్కు చూసుకొనవసరం లేకుండా స్టార్డం సంపాదించింది, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ తో వీర సింహ రెడ్డి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు కూడా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఇదిలా ఉంటె ఈ భామ గత కొంతకాలంగా డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లో తరుచు ఇద్దరు గడుపుతున్న మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంటారు. ఈ మధ్య శృతి.. ‘నాతో నేను సరదాగా ఉంటాను. నాలా నేను..నాతో నేను ఉంటేనే బాగుంటుంది. నాజీవితాన్ని నేనే ఇష్టపడతాను’ అంటూ ఓ పోస్ట్ పెట్టేసరికి..ఈమె శంతనుతో దూరమైనట్లుంది..అందుకే ఇలా ఒంటరిగా ఉన్నానని చెపుతుందంటూ ప్రచారం ఊపందుకుంది.
కానీ ఈ ప్రచారం లో ఏమాత్రం నిజం లేదని..మీమిద్దరం కలిసే ఉన్నామని చెపుతూ ఓ రొమాంటిక్ పిక్ పోస్ట్ చేసింది. ఈ పిక్ లో ఇందులో ఇద్దరు కౌగిలించుకుని పరవశిస్తున్నారు. శంతను చేయి శ్రుతిహాసన్ కుర్రుల్లో ఉండగా…ఆ చేతిలో శ్రుతిహాసన్ చేయి వేసి కనిపిస్తుంది. ఈ ఫోటోకి ‘నేను కోరుకునేది ఇదే’ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఈ పిక్ చూసిన వారంతా వీరిద్దరూ డిప్ ప్రేమలోనే ఉన్నారంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.