నాని మరో ప్రయోగాత్మక చిత్రం నేడే లాంచ్ !

  • Written By: Last Updated:
నాని మరో ప్రయోగాత్మక చిత్రం నేడే లాంచ్ !

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం సెట్స్ పైన ఉండగానే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు  `బ్రోచే వారెవ‌రురా` ఫేమ్ వివేక్ ఆత్రేయ తో “అంటే సుందరానికి” అనే చిత్రంలో నటించనున్నాడు.

విజయ్ దేవరకొండ తో “టాక్సీవాలా” చిత్రాను తీసిన దర్శకుడు రాహుల్ సంక్రీత్య‌న్ తో “శ్యామ్ సింగ‌రాయ్‌ “అనే చిత్రంలో నటించడానికి సిద్దం అవ్వుతున్నాడు. దసర రోజున ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 70 ఏళ్ల వయసు మళ్లిన ఓ వ్యక్తి పాత్రలో నాని ఈ చిత్రంలో నటించనున్నాడు.

ఈ చిత్రం ను నేడు లాంచ్ చేస్తున్నారు. అందుకు సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెంకట్ బోయినపల్లి ఈ చిత్రంను నిర్మిస్తున్నాడు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

follow us