బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డికి సిద్ధార్థ్ కౌంటర్ ..!

  • Written By: Last Updated:
బీజేపీ విష్ణు వర్ధన్ రెడ్డికి సిద్ధార్థ్ కౌంటర్ ..!

టాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ కు బీజేపీ కి మధ్య రోజురోజుకు వివాదం ముదురుతోంది. ఇప్పటికే బీజేపీ పార్టీకి చెందిన వారు తనను బెదిరిస్తున్నారని చెప్పిన సిద్ధార్థ్ బిజెపి యువ ఎంపీ తేజశ్వి సూర్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తేజశ్వి సూర్య టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ కంటే దశాబ్దం వెనక వ్యక్తి అంటూ కామెంట్ చేశారు. కాగా తాజాగా సిద్ధార్థ్ పై ఏపీ బీజేపీ లీడర్ విష్ణు వర్ధన్ సంచనలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధార్థ్ సినిమాలకు దావూద్ ఇబ్రహీం డబ్బులు ఇస్తున్నాడంటూ ట్వీట్ చేశారు.

దాంతో సిద్ధార్థ్ వ్యాఖ్యలను బిజెపి తీవ్రంగా ఖండించింది. సిద్దార్థ్ కు బీజేపీ అంటే ద్వేషం ఉండవచ్చని కానీ సిద్దార్థ్ వ్యాఖ్యలు సమర్ధనీయమైనవి కావు..ఆయన దూకుడు తగించుకోవాలి. అంటూ పేర్కొంది. ఇక విష్ణు వర్ధన్ వ్యాఖ్యలకు గానూ తాజాగా సిద్ధార్థ్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. తాను సంక్రమంగా పన్ను కడుతున్నానని..వెళ్లి పడుకో విష్ణు ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ రిప్లై ఇచ్చారు.

follow us