సిద్ధార్థ్ కు ఒక్కరోజులో 500 పైగా బెదిరింపు కాల్స్..!

హీరో సిద్ధార్థ్ తన నంబర్ లీక్ అయిందంటూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. తన నంబర్ ను తమిళనాడు బీజేపీ ఐటీసెల్ లీక్ చేసిందంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. అంతే కాకుండా తనకు కేవలం ఒక్కరోజులోనే 500కు పైగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ సిద్దార్థ్ పేర్కొన్నారు. తనకే కాకుండా తన కుటుంబ సభ్యులకు సైతం బెదిరింపు కాల్స్ వస్తున్నాయని సిద్ధార్థ్ తెలిపారు. ఫోన్ చేసి తిడుతున్నారని..చంపుతాం రేప్ చేస్తామని బెదిరింపులకు పాల్పడతున్నారని సిద్ధార్థ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
అంతే కాకుండా తనకు వచ్చిన కాల్స్ అన్నీ రికార్డ్ చేశానని ఫోన్ వచ్చిన నంబర్ లకు బీజేపీ కి సంబంధించిన డీపీలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. ఈ వివారలన్నీ పోలీసుల మందు పెడతానని సిద్ధార్థ్ అన్నారు. తాను మౌనంగా ఉండనని పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ను నరేంద్రమోడీ మరియు అమిత్ షాలకు ట్యాగ్ చేశారు. ఇదిలా ఉండగా సిద్ధార్థ్ కరోనా కట్టడిలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందనీ సెలబ్రెటీలు ఎందుకు ప్రశ్నించడంలేదని…ప్రజలు కూడా ఎందుకు ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారో అని ట్వీట్స్ చేశారు.