మళ్లీ తెరపైకి సారంగదరియా వివాదం..తెలంగాణ పాటను రాయలసీమ సింగర్ తో పాడించారంటున్న కోమలి..!

లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఈ సినిమాకు ఇప్పటివరకు ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండానే సారంగదరియా పాట సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకుపోయింది. ఈ తెలంగాణ జానపద గేయానికి శ్రోతలు ఫిదా అయిపోయారు. పాటకు తగ్గట్టుగా సాయిపల్లవి వేసిన స్టెప్పులు ప్రేక్షకుల మదిని దోచేసాయి. ఇక ఇప్పటికే 150మిలియన్లకు పైగా వ్యూవ్స్ తో ఈ పాట యూట్యూబ్ లో నయా రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఈ పాట పై ముందు నుండి ఓ వివాదం కూడా నడుస్తుంది. ఈ పాట తనదేనని కానీ తన పర్మిషన్ లేకుండా సినిమాలో వాడుకున్నారని జాగపదగాయని కోమలి పలు ఇంటర్యూలలో వెల్లడించింది.
దాంతో చిత్ర దర్శకుడు శేకర్ కమ్ముల కోమలి తో మాట్లాడి వివాదానికి చెక్ పెడుతున్నట్టు తెలిపారు. ఆడియో ఫంక్షన్ లో కోమలి చేత పాటను పాడించడంతో పాటు..ఆమెకు తన నెక్ట్స్ సినిమాలో అవకాశం ఉంటే పాడే చాన్స్ ఇస్తానని చెప్పారు. అక్కడితో ఈ వివాదం సద్దుమనిగిందనుకుంటే తాజాగా మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా ఓ టీవీ ఇంటర్యూలో కోమలి మాట్లాడుతూ…ఈ పాటకు తనకు తగిన గుర్తింపు లభించలేదని తెలిపింది. పాటలో రచయిత సుద్దాల అశోక తేజ పేరు పక్కన సేకరణ అని తన పేరువేయాలని చెప్పినా వేయలేదని చెప్పింది. అంతే కాకుండా తెలంగాణ జానపదాన్ని రాయలసీమకు చెందిన మంగ్లీతో పాడించారని ఆవేదన వ్యక్తం చేసింది.