మహేష్ సోదరిగా సింగర్ సునీత ..?

సింగర్ సునీత పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఎన్నో అద్భుతమైన పాటలను పాడుతూ సంగీత ప్రియులను అలరిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు తెరవెనుక మాత్రమే కనిపించే ఈమె..ఇప్పుడు తెరపై కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కబోయే మూవీ లో సునీత..మహేష్ సోదరి గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఆమె పాత్ర చాల బాగుంటుందని , నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు.
ఇప్పటికే ఈ మూవీ తాలూకా మొదటి షెడ్యూల్ పూర్తి కాగా..ఆ తర్వాత మహేష్ ఫ్యామిలీ లో విషాద ఘటనలు చోటుచేసుకోవడం తో సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది. సంక్రాంతి తర్వాత కొత్త షెడ్యూల్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ లో పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నాగ వంశీ నిర్మాత.
Related News
సుమతో కలిసి నవ్వులు పూయిస్తున్న సింగర్ సునిత..ఫోటో వైరల్
2 years ago
సింగర్ సునీత పెళ్లి.. విమర్శలపై నాగబాబు కామెంట్స్
2 years ago
నా అకౌంట్స్ అన్ని అతనే చూసేవాడు: సింగర్ సునీత
2 years ago
సునీత-రామ్: ప్రీ వెడ్డింగ్ పార్టీ ఆహ్వానం
2 years ago