సింగర్ సునీత పెళ్లి డేట్ ఫిక్స్ !

తెలుగు సింగర్ సునీత మొదటి వివాహం జరిగిన కొన్ని నాళ్ళకు సునీత ఆమె భర్త నుండి విడాకులు తీసుకుంది. ఆ సమయంలో ఆమె తన కుటుంబ బరువు బాధ్యతలు తీసుకొని, సినిమాల్లో మొదట సింగర్ అవ్వుదామని వస్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూ లో ఆమె చెప్పింది. ఆ తర్వాత కొన్నాళ్లకు గాయనిగా సినిమాల్లో అవకాశాలు రావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ మధ్యనే సునీత రెండో పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబ సభ్యులకు ఒకే చెప్పింది. ప్రముఖ యూట్యూబ్ చానల్ పాట్నర్ మ్యాంగో రామ్ తో రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. ఇరు కుటుంబాలు నడుమ ఆమెకు ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొన్నది.
ఈ ఏడాదే రామ్ సునీత ల వివాహం ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం మేరకు వీరి వివాహం ను ఈ నెల 26 న సునీత పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యినట్లుగా తెలుస్తుంది. ఈ ముహూర్తం దాటితే జనవరి నుండి మే వరకు మంచి ముహూర్తలు లేవు. కావున ఈ నెల లోనే సునీత, రామ్ ను పెళ్లి చేసుకోబోతున్నారు.