సునీత-రామ్: ప్రీ వెడ్డింగ్ పార్టీ ఆహ్వానం

  • Written By: Last Updated:
సునీత-రామ్: ప్రీ వెడ్డింగ్ పార్టీ ఆహ్వానం

ప్రముఖ గాయని సునీత త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది. కొన్ని రోజుల కింద మీడియా పర్సన్ రామ్ వీరపనేనితో నిశ్చితార్థం చేసుకుంది. ఈ సందర్భంగా డిసెంబర్ 26న గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీని ఇవ్వబోతున్నారు. ఈ పార్టీకి సంబంధించిన ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయి విడాకులు తీసుకున్న సునీత పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత.

ఆమె పెళ్లి ఈ నెల 27న జరిగే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ విషయం మీద ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. అయితే ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వని సునీత తన ప్రీ వెడ్డింగ్ పార్టీ ఒకటి ఏర్పాటు చేసింది.

follow us