సునీత సెకండ్ మ్యారేజ్ ! త్వరలోనే అధికారిక ప్రకటన ?

  • Written By: Last Updated:
సునీత సెకండ్ మ్యారేజ్ ! త్వరలోనే అధికారిక ప్రకటన ?

తెలుగు సింగర్ సునీత రెండో పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వైరల్ అవ్వుతుంది. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ పేరు ను సంపాదించుకుంది. ఎన్నో సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేసింది. మొదట ఆమె సింగర్ అవ్వుదామని వస్తే ఆమె గొంతు నచ్చి. హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పాలని కోరడంతో సింగర్ గా కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ పేరు సంపాదించుకుంది. సునీత వాయిస్ నచ్చి దర్శకుడు శేకర్ కమ్ముల డబ్బింగ్ చెప్పాలని కోరడంతో, “గోదావరి” సినిమాకు కమిలినీ ముఖర్జీ కి డబ్బింగ్ చెప్పింది. ఆ వాయిస్ ఆమె కు బాగా నచ్చి ఆమె నటించిన పలు చిత్రాలకు ఆమె డబ్బింగ్ చెప్పింది. అక్కినేని కోడలు సమంత కు కూడా సునీత డబ్బింగ్ చెప్పింది.

సునీత కు ఇద్దరు పిల్లలున్నారు. 19 ఏండ్ల వయసులోనే వాళ్ళ పెద్దలు ఆమె పెళ్లి చేశారు. జీవితం అంటే ఏంటో తెలియని ఏజ్ లో పెండ్లి చెయ్యడంతో భార్య, భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఆ మధ్య సినీ నటుడు అలీ “అలీ తో సరదాగా” షో లో సునీతను మీరు జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకుంటారా.. అని అడిగిన ప్రశ్నకు సునీత సమాధానంగా. ఏమో తెలియదు, నాకు మాత్రం చేసుకోవాలనే ఆలోచన లేదు. దేవుడు ఏ టైమ్ లో ఏమి నిర్ణయిస్తాడో మనకు ఏమి తెలుసు అని జవాబు ఇచ్చింది. సినిమా ఇండస్త్రి వర్గ్గాలనుండి తాజా సమాచారం మేరకు తెలుగు డిజిటల్ మీడియా రంగానికి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ ను సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నదని, అతనికి ఇంతకుముందే పెళ్లి అయ్యీ పిల్లలు ఉన్నారని, సమాచారం. త్వరలోనే సునీత నుండి అధికారిక ప్రకటన రాబోతుందని వార్తలు వస్తున్నాయి.

follow us